శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (09:25 IST)

నిజామాబాద్‌ నగర మేయర్ భర్తపై ఆటో డ్రైవర్ సుత్తితో దాడి (Video)

auto driver attack
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. భారత రాష్ట్ర సమితికి చెందిన నగర మాజీ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్‌పై ఓ ఆటో డ్రైవర్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. తొలుత భౌతికంగా దాడిచేసిన ఆటో డ్రైవర్.. ఆ తర్వాత సుత్తితో ఆయనపై విరుచుకుపడ్డాడు. దీంతో మేయర్ భర్తకు తీవ్రమైన రక్తగాయాలు అయ్యాయి. ఈ ఘటన స్థానిక కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరగడం గమనార్హం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.