కార్గో కంటైనర్ అడుగుభాగంలో రూ.4కోట్ల విలువైన ఇ-సిగరెట్లు స్వాధీనం
Updated: Thu, 12 Nov 2026 (17:48 IST)
జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పీఏ) వద్ద మాప్ రాడ్ కార్గోగా ప్రకటించబడిన ఒక కంటైనర్ అడుగుభాగంలో దాచి ఉంచిన ఇ-సిగరెట్ల సరుకును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందం అడ్డుకుంది. నిఘా సమాచారం ఆధారంగా, డీఆర్ఐ బృందం కంటైనర్లో సోదాలు నిర్వహించగా, అందులో 6,000 యుటో థానోస్, 7,000 యుటో లెన్స్ బ్రాండెడ్ ఇ-సిగరెట్లతో సహా మొత్తం రూ.4 కోట్ల విలువైన 13,000 ఇ-సిగరెట్లు లభించాయి.
ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం, 2019 ప్రకారం భారతదేశంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అన్ని ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ నిషేధించబడ్డాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లోని ఓడరేవులు, విమానాశ్రయాల నుండి డీఆర్ఐ ₹135 కోట్ల విలువైన 3.55 లక్షల ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకుంది.
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
మరింత చదవండి