1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Miscreants raped a woman after inviting her over for a conversation

మాట్లాడుకుందాం రమ్మని పిలిపించి మహిళపై అత్యాచారం చేసిన దుండగులు

crime
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళపై ముగ్గురు దుండగులు దాడి చేసి హోటల్ గదిలో అత్యాచారం చేసారు. మహిళపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం కాస్తా బైటకు వచ్చింది. బెగుసరాయ్ లోని ఒక హోటల్లో సమస్య పరిష్కారం కోసం మాట్లాడుకుందాము రమ్మని జీవిక అనే మహిళను కొంతమంది వ్యక్తులు పిలిచారు. వాళ్లు తెలిసినవారే కావడంతో మహిళ అక్కడికి వెళ్లింది. అనంతరం మాటామాటా పెరిగి మహిళపై దాడి చేయడం ప్రారంభించారు.
 
ఆమెను చెప్పులు, బూట్లతో కొట్టడమే కాకుండా పిడిగుద్దులు గుద్దుతూ దుర్భాషలాడారు. ఆమె దుస్తులు చింపేసారు. వీడియో తీసారు. అనంతరం మారణాయుధాలను చూపి చంపేస్తామని బెదిరించి ఆమెపై అత్యాచారం చేసారు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం కాస్త బైటకొచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
MakeMyTrip కొత్తగా ప్రవేశపెట్టిన Price Drop Protection బుకింగ్: విమాన ఛార్జీలు తగ్గితే ప్రయాణికులకు రీఫండ్