Sri Nandu: భిన్నమైన ద్రుక్పథంతో ముందుకు సాగుతున్న కథానాయకుడు శ్రీ నందు
Srinandhu with dir.
నందు నటించిన సైక్ సిద్ధార్థ్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందు ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగా, కథా రచనలోనూ భాగమయ్యారు. తనకు నచ్చిన కథను రాజీ పడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామాలు, కమర్షియల్ ఎంటర్టైనర్స్ వరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఆయన రెమ్యునరేషన్ పెంపుపై కూడా ఆసక్తి నెలకొంది.
అదేవిధంగా.. అవికా గోర్‌తో కలిసి శ్రీ నందు నటించిన అగ్లీ స్టోరీ సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2026 మే 22న విడుదలైంది. భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలతో కూడిన కథాంశంతో నందు మరో విభిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు.
ఇంకోవైపు, శ్రీ నందు నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం కాసు. ఇండు కుమార్‌తో కలిసి నందు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్. హర్షవర్ధన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందు కుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్నారు. డబ్బు, అత్యాశ, వాటి వల్ల మనుషుల జీవితాల్లో చోటుచేసుకునే మార్పుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు మగాళ్లు జిందాబాద్‌తో వినోదాత్మక ప్రయాణం చేయబోతున్నారు. ఇందులో వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ లాంచ్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థ్రిల్లర్స్, ఎమోషనల్ డ్రామాలతో పాటు వినోదాత్మక చిత్రాల్లోనూ నటిస్తూ తనలోని మరో కోణాన్ని చూపించేందుకు నందు ప్రయత్నిస్తున్నారు.
ఇంత అనుభవం వున్న నందు రెమ్యునరేషన్ విషయంలో ఆలోచిస్తున్నారని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ నందు తన రెమ్యునరేషన్‌ను కూడా పెంచుతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే పారితోషికం పెంపునకు సంబంధించిన వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
వరుస సినిమాలతో బిజీగా మారుతున్న శ్రీ నందు, నటుడిగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. విభిన్నమైన కథలు, ప్రధాన పాత్రలు, నిర్మాణ రంగంలో భాగస్వామ్యం వంటి అంశాలు ఆయన కెరీర్లో కొత్త అవకాశాలకు దారితీస్తున్నాయి.
ప్రస్తుతం కాసు, మగాళ్లు జిందాబాద్ వంటి ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న శ్రీ నందు, రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన తదుపరి సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.

