ప్రసాదంలో మత్తుమందు కలిపి మహిళలపై అత్యాచారం.. ఎక్కడ?
ఆలయానికి మహిళా భక్తులకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చే ఓ పూజారి... ఆ మహిళా భక్తురాలు స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా జరుపుతూ వచ్చిన పూజారి బండారాన్ని ఓ విద్యార్థిని బహిర్గంత చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ కామాంధ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా వాళపాడి అనే గ్రామంలో వెలుగు చూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, వాళపాడి ప్రాంతంలో శనీశ్వరుని పేరుతో విజయరాజ (50) అనే వ్యక్తి ఆశ్రమాన్ని చిన్నపాటి ఆలయాన్ని నడుపుతున్నాడు. స్థానికులను పూజలు, చేతబడుల పేరుతో నమ్మించాడు. దీంతో తన వద్దకు మహిళలు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ వచ్చాడు.
ఈ క్రమంలో వినాయకచవితి పండుగ సందర్భంగా ఓ విద్యార్థిని చందా కోసం ఆ పూజారి వద్దకు వెళ్లగా ఆయన అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక... పూజారి చేసిన పాడుపనిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పూజారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఆ తర్వాత పోలీసుల తనిఖీల్లో అతడి ల్యాప్‌టాప్‌లో 50కి పైగా అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పూజల కోసం వచ్చే మహిళలకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారికి పాల్పడుతూ సీక్రెట్ కెమెరాతో ఆ దృశ్యాలను చిత్రీరించేవాడని తేలింది.
ఈ వీడియోలను డబ్బు కోసం డార్క్ వెబ్ పోర్టర్స్‌కు విక్రయించినట్టు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పూజారిని అరెస్టు చేసి, అతని ఫోను, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

