1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Techie Kills Lover in Hotel Over 'Illicit Relationship' Issues

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

murder
ఐటీ నగరం బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రియురాలిన ఓ హోటల్ గదికి తీసుకెళ్లి ప్రియుడు చంపేశాడు. ప్రియురాలి శరీరంపై కత్తితో 17 సార్లు పొడిచిన గాట్లు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఈ వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమై వుంటాయని పోలీసులు భావిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మృతురాలిని ఇద్దరు పిల్లల తల్లి హరిణి (33)గా గుర్తించారు. ఆమె కెంగేరిలోనే నివాసముంటున్న తన ప్రియుడు టెక్కీ అయిన యశస్ (25)తో కలిసి హత్య జరగడానికి రెండు రోజుల ముందు ఓయో హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన యశస్.. హరిణిపై కత్తితో దాడి చేశాడు. ఏకంగా 17 సార్లు పొడిచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో హరిణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
వ్యక్తిగత కారణాలు వారి మధ్య ఉన్న సంబంధంలోని సమస్యలే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, హత్యకు గల కారణాలపై లోతుగా విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. 
తర్వాతి కథనం
Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్.. కారణం ఏంటంటే?