బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (10:35 IST)

తెలంగాణ మహిళపై సామూహిక అత్యాచారం.. స్నేహితుడితో అద్దెకు...

Rape
ఉద్యోగం కోసం లక్నో వచ్చి తన స్నేహితుడితో కలిసి అద్దెకు ఉంటున్న తెలంగాణ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
 
బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాంకీపురం పోలీస్ స్టేషన్‌లో 376డి (గ్యాంగ్ రేప్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిసిపి (నార్త్) ఖాసీం అబిది తెలిపారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. 
 
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు మనీష్ శర్మ (26), వర్జ్ తుకారాం యాదవ్ (30) ఇద్దరూ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 29 ఏళ్ల బాధితురాలు మాట్లాడుతూ.. మనీష్‌తో గత నాలుగేళ్లుగా స్నేహం ఉందన్నారు.
 
మనీష్ తన స్నేహితులతో కలిసి బుధవారం తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు' అని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.