మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

మహిళతో 60 యేళ్ల తండ్రి సహజీవనం.. కుమారుల దాడి.. ఇద్దరు మృతి

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. తన తండ్రి సహజీవనం చేస్తున్న మహిళపై కుమారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆ మహిళతో పాటు తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తాత తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలించారు. 
 
యూపీలోని కాన్పూర్‌‌కు చెందిన రాంప్రకాశ్ ద్వివేదీ (83), ఆయన కుమారుుడ విమల్ (63)లు కలిసి ఉంటున్నారు. వారిద్దరి కుమారులు లలిత్, అక్షిత్‌లు వేరుగా ఉంటున్నారు. అయితే, 30 యేల్ల కుష్బూ అనే మహిళతో విమల్ సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన కుమారుుడ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే తండ్రి ఇంటికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. 
 
ఈ వాగ్వివాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో తాత రాంప్రకాకశ్, తండ్రి విమల్, ఖుష్బూపై కుమారులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంప్రకాశ్, ఖుష్బూలు ప్రాణాలు కోల్పోయారు. విమల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.