ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (10:28 IST)

యూపీ వాసులకు కానుక.. ఉచితంగా గ్యాస్ సిలిండర్

lpg cylinder
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు. దీపావళి పండుగకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారందరికీ ఉచితంగా ఈ సిలిండర్లు ఇస్తామని ఆయన తెలిపారు. కాగా, ఇటీవలే ఈ పథకం కింద సరఫరా చేసే సిలిండర్లకు కేంద్రం రూ.300 మేరకు ధర తగ్గించిన విషయం తెల్సిందే. గత 2014కు ముందు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవడం కష్టంగా ఉండేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. 
 
మంగళవారం బులంద్ షహర్‌లో రూ.632 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వారందరికీ సిలిండర్ ధరను రూ.300 మేరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెల్సిందే. అదేసమయంలో యూపీలోని ఉజ్వల యోజన లబ్దిదారులకు దీపావళి పర్వదినం కానుకగా ఒక గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ఆయన వెల్లిడించారు.