మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (13:04 IST)

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ ప్రజలు ఒక్కటిగా పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
 
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేటు వద్ద గురువారం ఉదయం నిర్వహించిన సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
 
సకల జనుల సమ్మెలో పాల్గొని బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేరని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని రేవంత్ ప్రశ్నించారు. 
 
కార్మికులు గొంతెమ్మకు కావాల్సింది అడగడం లేదని, హక్కులు మాత్రమే అడుగుతున్నారని, సాధ్యం కానివి అడగడం లేదని, సింగరేణి నష్టాలకు జెన్‌కో చెల్లించకపోవడమే కారణమన్నారు.