వరంగల్ జంట హత్యల కేసు : ముద్దాయి మరణించేంత వరకు ఉరితీయండి.. కోర్టు తీర్పు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో జిల్లా మొదటి అదనపు కోర్టు తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ముద్దాయి చనిపోయేంత వరకు ఉరి తీయాలని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గత 2024 జూలై 10వ తేదీ అర్థరాత్రి వేళ చెన్నారావు పేట మండలం చింతల తండాలో జంట హత్యల ఘటన చోటుచేసుకుంది. గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు (బన్నీ), తండాకు చెందిన దీపికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, నాగరాజు ప్రవర్తన నచ్చక దీపిక పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నాగరాజు మాత్రం మరోలా అర్థం చేసుకున్నాడు. తన భార్యను కావాలనే దూరం చేశారని భావించి అత్తారింటిపై పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలో అర్థరాత్రి వేళ కత్తితో దీపిక కుటుంబంపై విచక్షణా రహితంగా దాడి చేయగా, దీపిక తల్లి సుగుణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అలాగే, తండ్రి శ్రీను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. ఈ దాడిలో గాయపడిన దీపిక సోదరుడు మదన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ జంట హత్య కేసుపై నెర్కొండ పోలీసులు పక్కాగా విచారించి, పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. బాధితుల తరపున స్పెషల్ వీపీ బృందాదేవిని అభినందించారు. నిందితుడు చర్య అత్యంత పాశవికమైనదని, సమాజాంలో ఇలాంటి నేరగాళ్లకు జీవించే హక్కు లేదని స్పష్టం చేస్తూ, నిందితుడు నాగరాజుకు మరణించే వరకు ఉరిశిక్షను అమలు చేయాలని తీర్పునిచ్చారు.
తర్వాతి కథనం
