సంబంధిత వార్తలు
- సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తాం : బండి సంజయ్ హెచ్చరిక
- ప్రతి బిడ్డకు శ్రీరామరక్ష.. అమ్మఒడి పథకం : సీఎం వైఎస్ జగన్
- ఏపీ సీఎం జగన్‌కు షాక్.. 11న విచారణకు హాజరు కావాలి.. కోర్టు సమన్లు
- కడప జిల్లాలో వినాయకుడి విగ్రహం మాయం - ఆలయ నిర్మాణానికి భూమిపూజ!
- హిందూ దేవుళ్ళతో పెట్టుకున్నారు.. పుట్టగతులుండవ్... : మాధవీలత
సీఎం జగన్‌పై అచ్చెన్న ఫైర్.. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలా?
Achenaidu
మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, టిడిపి శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అన్నారు.
ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్‌కు లేదని... అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
గోవును కోటి దేవతలకు ప్రతిరూపంగా ప్రజలు భావిస్తారని, గోవును అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గానికి నిదర్శనమని, సరైన పోషణ లేక ఎన్నో గోవులు మృత్యువాత పడ్డాయని, దానిపై స్పందించని ముఖ్యమంత్రి నేడు గుడికో గోమాత అంటూ విలక్షణ నటనకు తెరతీశారన్నారు.
ఇడుపులపాయలో క్రూర మృగాలను పెంచుతూ గుడికో గోమాత కార్యక్రమం చేపట్టడం విడ్డూరం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అర్హత ముఖ్యమంత్రికి లేదని అచ్చెన్న ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.
