1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
  4. women beauty care tips

ఫౌండేషన్ వాడుతున్నారా... అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు...

అలంకరణ ప్రతి ఒక్కరికీ ఆభరణమే. అలాగని ఎలా పడితే అలా మేకప్ వేసుకోవడం మంచిది కాదు. అందుకే అలంకరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందంగా కనిపించాలని చాలామంది ఫౌండేషన్ ఎక్కువగా వేసుకుంటుంటారు. నిజాని

women
అలంకరణ ప్రతి ఒక్కరికీ ఆభరణమే. అలాగని ఎలాపడితే అలా మేకప్ వేసుకోవడం మంచిది కాదు. అందుకే అలంకరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందంగా కనిపించాలని చాలామంది ఫౌండేషన్ ఎక్కువగా వేసుకుంటుంటారు. నిజానికి ఫౌండేషన్‌ని ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మతత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.
 
ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే ఫౌండేషన్ వేసుకున్నప్పుడు చక్కగా కనిపిస్తారు. ముఖ్యంగా మ్యాటీ, వెల్వెట్ అని రాసుండే ఫౌండేషన్స్ వాడకూడదు. ఫౌండేషర్ చర్మాతత్వానికి ముదురు ఛాయల్లో లేకుండా చూసుకోవాలి. అలంకరణ అంతా పూర్తయ్యాక పౌడరు అద్దుకోవడం చాలామంది చేస్తుంటారు. దాని వలన ముఖం కాంతివంతంగా ఉండదు. 
 
ఎందుకంటే దాన్ని విపరీతంగా రాసుకోవడం వలన కూడా ముఖంలో ముడతలు ఏర్పడుతాయి. పొడి చర్మం వారైతే పౌడరును చాలా పరిమితంగా రాసుకోవాలి. లేదంటే నవ్వినప్పుడు గీతల్లా పడి ముఖంలో కళ ఉండదు. అదేపనిగా కనుబొమల్ని షేప్ చేయించుకోవడం వలన వయసు పెరిగే కొద్దీ అవి పల్చబడిపోతాయి.
 
వాటిని అలాగే వదిలేస్తే కూడా వయసులో పెద్దవారిలా కనిపించడం ఖాయం. అందుకే షేప్ చేయించుకున్నా లేదా చేయించుకోకపోయినా అలంకరణ చేసుకునే ముందు ఐబ్రోపెన్సిల్‌తో దిద్దుకోవడం మంచిది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే నువ్వులు..