శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (16:16 IST)

గోర్లు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

శరీరంలో ఉన్న అవయవాల్లో గోర్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి నిర్జీవ కణాలే అయినప్పటికీ వీటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే వాటిలో చేరే క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాలను కలిగిస్తాయి. సరైన పోషకాల

శరీరంలో ఉన్న అవయవాల్లో గోర్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి నిర్జీవ కణాలే అయినప్పటికీ వీటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే వాటిలో చేరే క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాలను కలిగిస్తాయి. సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వలన గోర్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చును. మరి ఆ గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
 
క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ పొడిబారిన గోర్లకు చక్కగా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు పచ్చి క్యారెట్లను లేదా జ్యూస్‌ను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. గోర్ల పెరుగుదలకు బీన్స్ చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా గోర్లు పగుళ్లు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజూ కోడిగుడ్లను ఉడికించుకుని తీసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 
పగిలిన స్థితిలో ఉన్న గోళ్ల సమస్య నుండి విముక్తి చెందుటకు పాలను తీసుకుంటే మంచిది. గుమ్మడికాయ విత్తనాలకు శరీర రోగనిరోధక వ్యవస్థకు పటిష్టం చేసే గుణాలున్నాయి. వీటిలోని జింక్ గోర్ల పెరుగుదలను వృద్ధి చేస్తుంది. వాటికి సంరక్షణనిస్తుంది. టమోటాల్లో ఉండే లైకోపీన్, బయోటీన్‌లు గోళ్లకు దృఢత్వాన్ని, మృదుత్వాన్ని అందిస్తాయి. వీటిల్లోని విటమిన్ ఎ, సిలు గోళ్లకు సంరక్షణగా ఉంటాయి.