మీల్‌‌‌‌‌మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు మీల్‌ మేకర్‌ - ఒక కప్పు ఉల్లిపాయలు- రెండు పచ్చిమిర్చి- రెండు అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్ పసుపు - చిటికెడు కారం - 2 స్పూన్స్ పుదీనా -

Kowsalya| Last Updated: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:43 IST)
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు
మీల్‌ మేకర్‌ - ఒక కప్పు
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
పసుపు - చిటికెడు
కారం - 2 స్పూన్స్
పుదీనా - కొద్దిగా
కొత్తిమీర - 2 స్పూన్స్
బిర్యానీ ఆకు - ఒకటి
యాలకులు - రెండు
లవంగాలు - రెండు
దాల్చినచెక్క - అంగుళం ముక్క
నూనె లేదా నెయ్యి- 1 స్పూన్
ఉప్పు - తగినంత
నీళ్లు - తగినన్ని

తయారీ విధానం:
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే వేడినీటిలో మీల్‌ మేకర్‌, కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పడు బాణలిలో సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగించి మసాలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. తరువాత నీరు మొత్తం పోయేలా మీల్‌మేకర్‌ను చేతులతో పిండాలి. ఆ మీల్‌మేకర్‌లో కొద్దిగా ఉప్పు, కారం, మసాలా వేసి కలిపిపెట్టుకోవాలి.

బాణలిలో నూనె పోసి వేడయ్యాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మీల్‌ మేకర్‌ వేసి మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత కొత్తిమీర, పుదీనా, బాస్మతి బియ్యం వేసి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. అంతే వేడివేడి మీల్‌మేకర్ బిర్వానీ రెడీ.దీనిపై మరింత చదవండి :