1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
  4. Diego Maradona 'fine' after being seen by doctor during World Cup match

ఫిఫా వరల్డ్ కప్-అర్జెంటీనా గెలుపు-మారడోనాకు బీపీ పెరిగిపోయింది..

రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ సాకర్ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి నుంచి అర్జెంటీనా గట్టెక్కింది. దీంతో లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ డీగో మారడోనా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అలాగే అర్జెంటీనా గెలిచిన

Diego Maradona
రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ సాకర్ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి నుంచి అర్జెంటీనా గట్టెక్కింది. దీంతో లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ డీగో మారడోనా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అలాగే అర్జెంటీనా గెలిచిన తర్వాత తీవ్ర ఉద్వేగానికి గురైన మారడోనా అనారోగ్యం పాలయ్యాడు. మ్యాచ్‌కు అర్థభాగంలో లియోనెల్ మెస్సీ గోల్ చేయగానే మారడోనా ఎగిరి గంతేశాడు. 
 
1986 వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలిపిన ఈ స్టార్ ప్లేయర్.. ఈ మ్యాచ్ మొత్తం ఎంతో ఉద్వేగంతో కనిపించాడు. నైజీరియాతో జరిగిన మ్యాచ్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా మార్కోస్ రొజో గోల్ చేయడంతో మారడోనా ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు. మ్యాచ్ ముగిసే సమయానికి అతడు పూర్తిగా అదుపు తప్పాడు.
 
నడవలేని స్థితిలో ఉండటంతో అతన్ని ఇద్దరు స్నేహితులు పట్టుకొని వీఐసీ సెక్షన్ డైనింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. వెంటనే ఇద్దరు డాక్టర్లు అతని బీపీ, పల్స్ చెక్ చేశారు. మారడోనాకు ఒక్కసారిగా బీపీ పెరిగిపోయిందని అర్జెంటీనా మీడియా వెల్లడించింది. ప్రస్తుతం మారడోనా చికిత్స తీసుకుంటున్నాడు. మారడోనా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు వెల్లడించారు. 
తర్వాతి కథనం
క్రికెట్ ఫ్యాన్స్ అత్యధికంగా ఎక్కడున్నారో తెలుసా?