గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (16:06 IST)

ఆస్తమాను తరిమేసే హాస్య యోగాసనం.....

నేటి జీవితంలో నవ్వుకు చోటే దక్కటం లేదు. రోజూ కనీసం ఓ అరగంటపాటు హాయిగా నవ్వేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలియజేశారు. కీళ్లవాపు, కండరాల నొప్పులు, జిగుసుకుపోవడం వంటి ఇబ్బందులు న

నేటి జీవితంలో నవ్వుకు చోటే దక్కటం లేదు. రోజూ కనీసం ఓ అరగంటపాటు హాయిగా నవ్వేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలియజేశారు. కీళ్లవాపు, కండరాల నొప్పులు, జిగుసుకుపోవడం వంటి ఇబ్బందులు నవ్వుతో తగ్గిపోతాయి. బాధను తగ్గించే ఎండార్ఫిన్‌లు పార్శ్వ నొప్పితో బాధపడేవారికి నవ్వును ఓ చికిత్స విధానంగా ప్రయోగిస్తున్నారు.
 
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి నవ్వు ఓ మంచి వ్యాయామం. నవ్వువలన ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఆస్తమా రోగులకు శ్వాస నాళాల్లో శ్లేష్మం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దానిని బయటకు తెప్పించేందుకు వైద్యులు ఫిజియోథెరపీని సూచిస్తున్నారు.
 
బూరలు ఊదటం వంటివి చేయించడం వలన శ్లేష్మాన్ని బయటకు రప్పించేందుకు సహాయపడుతుంది. నవ్వినపుడు శ్వాసకోశాలు విచ్చుకుని శ్లేష్మం బయటకు వచ్చే అవకాశం ఉంది. అతిగా నవ్వినపుడు ఆస్తమా రోగులకు ఇబ్బంది ఎక్కువ కావచ్చును. ఆ సందర్భంలో తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.