ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (12:17 IST)

కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? జాగ్రత్తలేమిటి?

సోయాబీన్స్, చాక్లెట్స్ తినడం వలన కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశముంది. అంతేకాకుండా టమోటాపై పల్చగా ఉండే పొర, కొబ్బరిపై ఉండే టెంకలాంటివి కిడ్నీలలో రాళ్లు ఏర్పడేందుకు కారణామవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్య

సోయాబీన్స్, చాక్లెట్స్ తినడం వలన కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశముంది. అంతేకాకుండా టమోటాపై పల్చగా ఉండే పొర, కొబ్బరిపై ఉండే టెంకలాంటివి కిడ్నీలలో రాళ్లు ఏర్పడేందుకు కారణామవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి తప్పించుకోనేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
క్యాల్షియం సప్లిమెంట్లు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల మూత్రం విసర్జించాల్సి ఉంటుంది. కాబట్టి శరీర కణాల నిర్వహణను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి 4 లీటర్ల మంచినీళ్లు త్రాగాలి. 
 
ఆల్కహాల్ వలన మూత్రం ఎక్కువగా వచేందుకు అవకాశాలున్నాయి. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని తీసుకోరాదు. ఆరెంజ్ రసానికి క్యాల్షియం ఆక్సిలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించేందుకు సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా పదార్థాలు తీసుకుంటే కిడ్నీ రాళ్ల సమస్యలను దారితీసే అవకాశం ఉంది. అందుకు పుల్లని పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకోరాదు.