శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (09:45 IST)

ఉసిరికాయలను ఆవు నేతిలో దోరగా వేయించి.. తేనెలో నానబెట్టి?

ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉసిరికాయ కాలేయాన్ని బలపరుస్తుంది. మెదడు, మానసిక పనితీరును పెంచుతుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది. ఉసిరికాయలను ఆవు నెయ్యిలో దోర

ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉసిరికాయ కాలేయాన్ని బలపరుస్తుంది. మెదడు, మానసిక పనితీరును పెంచుతుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది.


ఉసిరికాయలను ఆవు నెయ్యిలో దోరగా వేయించి తేనెలో ఊరబెట్టి రోజు ఉదయాన్నే ఒక ఉసిరికాయ తింటుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. తేనెలో ఊరించిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటీ సమస్యలకు మంచి విరుగుడు. అంతేకాకుండా ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైల్స్ నుంచి తక్షణ ఉపశమనాన్నిస్తుంది.  
 
నాలుగు పదులు దాటిన వారు తప్పకుండా రోజుకో ఉసిరికాయ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరికాయలో లభించే విటమిన్‌ సి మరి ఏ పండులో లభించదు. ఉసిరికాయను తరచూ ఆహారంలో తీసుకుంటే తల వెట్రుకలు త్వరగా తెల్లబడవు, చర్మం మృదువుగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, దంత సంబంధమైన సమస్యలు దరిచేరవు. 
 
అలర్జీతో తరచూ బాధపడే వారు ఒక చెంచా ఉసిరిరసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే ఉపశమనం పొందుతారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు ఈ పండ్లు తినిపిస్తే సరిపోతుంది. ఉసిరికాయ గుండె సంబంధిత వ్యాధులను, ఆందోళనలను, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. చర్మ సమస్యలు ఉన్న వారు ఉసిరి రసాన్ని చర్మంపై రాసుకుంటే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.