1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Hallmarking, XRF tests can detect gold adulteration: Bullion Association Chief

బంగారంలో రేడియం పౌడర్ కల్తీ : బులియన్ అసోసియేషన్ చీఫ్ ఏమంటున్నారు?

gold
బంగారంలో రేడియం పౌడర్ కలుపుతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. దీనిపై ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ స్పందించింది. ఇటువంటి నిరాధార వార్తలను నమ్మి ప్రజలు అనవసరంగా భయాందోళన చెందవద్దని అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు యోగేశ్ సింగ్లా స్పష్టం చేశారు. పసిడి నాణ్యతను నిర్ధారించడానికి ప్రస్తుతం అత్యంత అధునాతన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని, హాల్‌మార్కింగ్, ఎక్స్ఆర్ఎఫ్ పరీక్షల ద్వారా ఎలాంటి కల్తీనైనా సులభంగా పసిగట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు.
 
ఐఏఎన్ఎస్‌తో మాట్లాడిన ఆయన, బంగారంలో ఇతర లోహాలను కలపడం అనే ఆందోళన ఆభరణాల రంగానికి కొత్తేమీ కాదని తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇరిడియం, రుథేనియం, రీనియం వంటి లోహాలతో కూడిన ప్రచారాలు కాలానుగుణంగా వస్తూనే ఉన్నాయని గుర్తుచేశారు. ఈ తరహా ప్రచారాలు వచ్చిన ప్రతిసారీ అసోసియేషన్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిందని, మన దేశంలో ఉన్న పరీక్షా విధానాలు ఇటువంటి కల్తీలను సమర్థవంతంగా అడ్డుకోగలవని ఆయన తేల్చిచెప్పారు.
 
పైగా, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని, అనవసరమైన పుకార్లను పట్టించుకోవద్దని వినియోగదారులకు ఆయన సూచించారు. అదేసమయంలో బంగారం కొనుగోలు సమయంలో కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని కోరారు. కేవలం పేరున్న, నమ్మకమైన నగల వ్యాపారుల వద్ద నుంచే ఆభరణాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ప్రతిసారీ హాల్‌మార్క్ వివరాలతో కూడిన పక్కా బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలని యోగేశ్ సింగ్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆన్‌లైన్ ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్‌ను కలిసేందుకు వెళ్లిన యువకుడు.. కొట్టి చంపేసిన వైనం.. ఎక్కడ?