1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Today Gold Rates downfall

దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ళ సీజన్ : దిగివచ్చిన బంగారం ధరలు

gold
దేశ వ్యాప్తంగా వివాహాల సీజన్ వచ్చింది. దీంతో దేశంలో బంగారు, వెండి ధరలు కూడా దిగివచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతున్న అంచనాలు, అమెరికా ట్రెజరీ బాండ్ ప్రతిఫలాలు పెరగడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.2,500 వరకు పడిపోయింది.
 
24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ప్రస్తుతం రూ.1,35,910కి దిగొచ్చింది. క్రితం రోజు ముగింపు ధర 1,38,400తో పోలిస్తే రూ.2,500కి పైగా తగ్గింది. మరోవైపు వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది. కిలో వెండి రూ.1,74,749 నుంచి రూ.1,69,510కి పడింది. మొత్తంగా రూ.5 వేలకుపైగా తగ్గింది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర 1.8 శాతం వరకు పతనమై.. ఔన్సు ధర 3789 డాలర్లకు దిగొచ్చింది. ఇక, వెండి కూడా ఔన్సు ధర 46.02 డాలర్లకు పడిపోయింది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ.1,31,512 గా ఉంది. సిల్వర్‌ ఫ్యూచర్‌ కేజీ ధర రూ. 1,64,279గా కొనసాగుతోంది.
 
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. దాంతో బంగారం. వెండి లాంటి వడ్డీ ఇవ్వని లోహాలపై మదుపర్లకు ఆసక్తి తగ్గింది. దేశీయంగా రూపాయి బలపడటం మరో కారణం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు 93.27 వద్ద ప్రారంభమైంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విజయవాడ సమీపంలో అమరావతి హై స్పీడ్ రైల్వే స్టేషన్ : కేంద్రం ఓకే