స్థానిక పోరులో గొడ్డలి పార్టీ అరాచకాలకు పాల్పడొచ్చు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పైగా, ఈ ఎన్నికలు సాఫీగా జరగడం గొడ్డలి పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.
శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలిపార్టీ నాయకుడికి ఇష్టం లేదన్నారు. అందువల్ల స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైకాపా అధినేత జగన్ యత్నిస్తున్నట్లు విమర్శించారు.
ఎన్నికలు వాయిదా పడితే ఆ పార్టీకి లాభం అనుకోవడం దింపుడుకళ్లెం ఆశలే అన్నారు. స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందన్నారు. ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది టీడీపీనే అని పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం సీట్లు అనేది చట్టపరమైన రక్షణ మాత్రమే అని సీఎం పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 34 శాతం కంటే ఎక్కువ సీట్లే బీసీలకు ఇచ్చినట్లు తెలిపారు.
