పచ్చిబఠాణీ పేస్ట్‌ను అక్కడ రాస్తే.. ఏమవుతుంది..?
పచ్చిబఠాణీలను కూరల్లో, సలాడ్స్‌లో తరచు వాడుతుంటాం. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. లెగ్యూమ్ జాతి ఇతర గింజల కంటే పచ్చి బఠాణీలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొవ్వు శాతం కూడా ఎక్కువ. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చిబఠాణీలోని నియాసిన్ అనే విటమిన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
పచ్చిబఠాణిలో విటమిన్ కె అధికంగా లభిస్తుంది. ఇది అల్జీమర్స్, ఆర్థరైటిస్ సమస్యల్ని తగ్గిస్తుంది. కాలిన గాయాల మీద పచ్చిబఠాణీ పేస్ట్‌ను రాస్తే నొప్పి తగ్గుతుంది. పచ్చిబఠాణీలు చిన్న పిల్లల్లో నాడీ సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి. వీటిని తరచు తీసుకోవడం వలన వెంట్రులకలకు బాగా పోషణ అందుతుంది. కప్పు పచ్చిబఠాణీలో ప్రోటీన్లు ఎక్కువ ఉన్నాయి. గుండె, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి.
రోజూ కప్పు పచ్చిబఠాణీలు తింటే.. అధిక బరువు తగ్గుతారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, బ్యాక్టీరియల్ గుణాలు డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో లభించే పదార్థాలన్నీ క్యాన్సర్ కారకాలను నివారిస్తాయి. అంతేకాదు.. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపు చేస్తుంది. పచ్చిబఠాణీలోని పీచుపదార్థం అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. జీర్ణవ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది.

