గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (12:37 IST)

టిఫన్ మానేస్తే వచ్చే సమస్యలేంటో తెలుసా?

మనలో చాలామంది ఉదయం పూట ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. ముఖ్యంగా, మహిళల్లో ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అల్పాహారం తీసుకోకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇలాంటి వారు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉన్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
* అల్పాహారం మానేయడం వల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 
* బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అధికంగా బ‌రువు పెరగడమే కాదు శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ట. కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. 
* బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
* అల్పాహారం మానేస్తే మెద‌డు యాక్టివ్‌గా ఉండ‌దట. ఈ కారణంగా ఉత్సాహం, చురుకుద‌నం త‌గ్గ‌డం, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉత్పన్నమవుతాయి.