మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (10:37 IST)

పెరుగు తేలేదని అమ్మ తిట్టింది.. స్నేహితుడికి వీడియో కాల్ చేసి?

స్నేహితుడికి వీడియో కాల్ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి దూషించిందనే మనస్తాపంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ఆ యువకుడు తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి జరిగింది.


వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వివేక్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి కుటుంబం కూడా కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చేసింది. దీంతో అందరూ కలిసి చింతల్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంటి దగ్గర ఉన్న వివేక్‌కు తల్లి పెరుగు తీసుకురమ్మని చెప్పింది.

ఎంత సమయం అవుతున్నా.. అతడు వెళ్లకపోవడంతో తల్లి తిట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్.. పెట్రోల్ తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. 
 
మనస్తాపానికి గురైన శివ స్నేహితుడికి వీడియో కాల్ చేసి.. అతడు చూస్తుండగానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో భయపడిపోయిన శివ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, వాళ్లు అక్కడకు చేరుకునే సరికే వివేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.