కర్భూజను వేసవి కాలంలోనే ఎందుకు తీసుకోవాలి..?
Musk Melon
పైగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇది వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. స్టమక్ అల్సర్స్ కూడా వుండవు.
కర్భూజలో బీటాకెరోటిన్ ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలానే కర్భూజలో సోడియం, పొటాషియం ఉంటుంది, ఇది ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. కిడ్నీలో రాళ్లు సమస్యలు కూడా ఇది తొలగిస్తుంది. దీనిలో అధిక శాతం నీరు ఉంటుంది కాబట్టి ఆ సమస్య కూడా తొలగిపోతుంది.
అలానే గుండె సంబంధిత సమస్యలు కూడా ఇది తరిమికొడుతుంది. ప్రతి రోజు ఒక మనిషి 250 నుంచి 300 గ్రాములు ఖర్బూజాని తీసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్థులు 100 నుంచి 150 గ్రాములు మాత్రమే తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.
