శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:41 IST)

వేస‌విలో సినిమాలు నిర్మాత‌ల‌కు ప‌రీక్షే!

chiru, balayya, raviteja, pawan
సినిమారంగానికి వేస‌వి, పండుగ సెల‌వులు క‌లెక్ష‌న్ల‌కు నిల‌యాలు. కానీ ప్రస్తుతం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ఇందుకు కార‌ణం దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌రోవిడ‌త బ‌య‌ట‌ప‌డ‌డ‌మే. ఒక‌వైపు ఎల‌క్ష‌న్లు కొన్నిచోట్ల జ‌రుగుతున్నాయి. కానీ ఎల‌క్ష‌న్ల అనంత‌రం క‌రోనా ధాటికి రెండో విడ‌త లాక్‌డౌన్ వ‌స్తుందేమోన‌ని భ‌యంతో వున్నారు.

మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రెండోవిడ‌త క‌రోనా ధాటికి రానా న‌టించిన `హాథ‌ధీమేరాసాథీ` సినిమాను నిలుపుచేశారు. తెలుగు, త‌మిళ‌భాష‌ల్లో రిలీజైంది. ఆ త‌ర్వాత క‌రోనా కేసులు ఎక్క‌వుతున్న‌ట్లు వార్త‌లు చెబుతున్నాయి. బెంగుళూరు, చ‌తీస్‌ఘ‌డ్, కేర‌ళ వంటి ప్రాంతాల్లో క‌రోనా ధాటికి యాభై శాతం థియేట‌ర్ల సీటింగ్ కెపాసిటీ వుంద‌ని అంటున్నాయి. దాంతోపాటు తెలంగాణ‌, ఆంధ్ర లోనూ క‌రోనా కేసులు పెరిగాయి. దీంతో తెలంగాణాలో లాక్‌డౌన్ వుంటుంద‌ని, సినిమా థియేట‌ర్లు మూసివేస్తార‌ని లేదా యాభైశాతం సీటింగ్ వుంటుంద‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. 

ఈ విష‌యాన్ని దిల్‌రాజుతో స‌హా ప‌లువురు సీనియ‌ర్లు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఆ వెంట‌నే సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ, తెలంగాణ‌లో థియేట‌ర్లు మూసివేయ‌మ‌ని, యాభై శాతం కెపాసిటీ త‌గ్గించ‌మ‌నీ, ప్రేక్ష‌కులు అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.
 
ఇంత చేసినా అ్ర‌గ‌హీరోల సినిమాల‌పై వేస‌వి ప్ర‌భావం బాగా ప‌డింది. కొద్దిరోజుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ `వ‌కీల్‌సాబ్‌` విడుద‌ల కాబోతుంది. ఆ దెబ్బ‌కు మామూలుగా చిన్న సినిమాల విడుద‌ల‌లు కూడా ఆగిపోయాయి. లేదంటే వారానికి క‌నీసం ఐదు సినిమాలు విడుద‌ల అవుతుండేవి. ఇక ఆ త‌ర్వాత స‌మ్మ‌ర్‌లో పెద్ద సినిమాలు మెగాస్టార్ ఆచార్య, బాలయ్య-బోయపాటి సినిమా, రవితేజ ఖలాడీ సినిమాలు మే నుంచి జూన్ మధ్యలో వున్నాయి.

అయితే ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు విడుదల అవుతాయా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఒక్క చిరంజీవి సినిమాకే ఎటువంటి అడ్డంకులు క‌ల‌గ‌వ‌ని సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఆ త‌ర్వాత మిగిలిన రెండు సినిమాలు అప్ప‌టి వాతావ‌ర‌ణ బ‌ట్టి ప‌రిశీలించేదిశ‌గా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆలోచిస్తున్నారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. క‌రోనాతోపాటుగా స్కూల్స్ ఎలాగో లేవు కాబ‌ట్టి అంద‌రూ ఆన్‌లైన్ క్లాస్లుల‌పై దృష్టిపెట్టారు. ప‌రీక్ష‌లు కూడా స‌మ్మ‌ర్‌లోనే జ‌రుగుతాయి. ఉద్యోగం కో్సం ప‌లు పోటీప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పుడు యూత్ సినిమాల‌కంటే ఎవ‌రి భ్ర‌ద‌త వారు చూసుకునేవిధంగా ఆలోచ‌న‌లు మారిపోయాయ‌ని సినీపెద్ద‌లు అంటున్నారు.

కాబ‌ట్టి యూత్ సినిమాల‌కు రావ‌డం క‌ష్ట‌మే. ఇక కుటుంబాలు వ‌స్తాయా లేదా అనేది కూడా అనుమానంగా వుంది. ప్ర‌కృతి ఎప్పుడు ఎలా వుంటుందో తెలీదుకాబ‌ట్టి ఒక్క‌సారిగా క‌రోనా కేసులు పెరిగితే ఇప్పుడు పెద్ద రేట్ల‌తో ఫ్యాన్సీరేట్ల‌తో పెద్ద సినిమాలు కొన్న వారంతా ఏమ‌వుతారో అనేది ఆలోచిస్తే భ‌యంగా వుంద‌ని ఓ ప్ర‌ముఖ నిర్మాత తెలియ‌జేశారు. ఏదిఏమైనా అంతా దేవుడిపై భారం వేస్తున్నామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేస్తున్నారు.