గురువారం, 7 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (22:37 IST)

అన్నం.. పప్పు చారు.. మామిడి పండును నంజుకుంటున్నారా?

వేసవి వచ్చేసింది. వేసవిలో నోరూరించే మామిడి పండ్లని తినడానికి అందరూ ఇష్టపడతారు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, మామిడి పండ్లని తింటే బరువు పెరుగుతారా ? అనేదే. అయితే ఇది అపోహ మాత్రమేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు మీరైతే.. సంవత్సరానికి వేసవిలో వచ్చే పండ్లల్లో రారాజును తినకుండా మిస్ చేసుకున్నట్టే.
 
నిజానికి మామిడి పళ్ళలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి చాలా అవసరం. ఇందులో ఉండే ప్రోటీన్లు, పీచు పదార్థాలు జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తాయి. దానివల్ల శరీర జీవక్రియ పనితీరు మరింత మెరుగవుతుంది. ఇవి వేసవి కాలంలో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ సీజన్‌లో వచ్చే మామిడి తప్పక తీసుకోవాలి. ఇంకా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది. 
 
ఐతే మామిడి పళ్ళని తినడానికి ఒక పద్ధతి ఉంది. మామిడి రసం, ఐస్ క్రీమ్, జ్యూస్, వాటి ద్వారా తీసుకుంటే కొవు పెరిగే అవకాశం ఎక్కువ. అలా కాకుండా మామిడి పండుని ముక్కలుగా కత్తిరించుకుని తినాలి. ఇంకో విషయం స్నాక్స్‌లా మామిడి ముక్కలని మాత్రమే తినాలి. ఇతర ఆహారంతో పాటు తినకూడదని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.