సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:19 IST)

నీకు అక్కడ కాస్త కొవ్వు ఎక్కువుంది, గదిలో ప్రాక్టీస్ చేద్దాం రమ్మంటూ తీస్కెళ్లి...

డ్యాన్స్ స్కూల్ ట్యూటర్ ఒకరు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఊచలు లెక్కిస్తున్నాడు. బాలికకు డ్యాన్స్ పట్ల ఉత్సాహం వుండటంతో ఆమె తల్లిదండ్రులు డ్యాన్స్ ట్యూషన్లో చేర్పించారు. ప్రతిరోజూ బాగానే చెప్పే ఆ డ్యాన్స్ మాస్టర్ కామాంధుడుగా మారిపోయాడు. నీకు నడుము దగ్గర కాస్త కొవ్వు ఎక్కువగా వుంది, దాన్ని తగ్గించాలని గది లోపలికి తీసుకుని వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
 
వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని బోయిన్ పల్లి మార్కెట్ సమీపంలోని అర్బన్ డ్యాన్స్ స్కూల్లో బాలిక గత 3 నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. ఐతే డ్యాన్స్ పూర్తిస్థాయిలో రావాలంటే నడుము వద్ద కొవ్వు తగ్గాలనీ, అందుకోసం రోజూ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకూ వర్కవుట్ సెషన్స్‌లో పాల్గొనాలని చెప్పాడు.
 
అతడు మాటలు నమ్మిన బాలిక రోజూ వర్కవుట్స్ కి వెళ్తోంది. ఐతే గురువారం ఉదయం డ్యాన్స్ స్కూలుకు రాగానే ఆమెను గది లోపలికి తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు 100కి డయల్ చేసి పోలీసులకి ఫిర్యాదు చేసారు. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు.