బొప్పాయి గింజల్లో ఉన్న మేలెంత?: బొప్పాయిని 40 రోజులు తింటే?
బొప్పాయిలో ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి మాత్రమే కాకుండా.. ఆ పండులో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. బొప్పాయి గింజల్లో
బొప్పాయిలో ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి మాత్రమే కాకుండా.. ఆ పండులో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఐసో థయోసైనేట్ క్యాన్సర్ నివారణ కారకంగా పనిచేస్తుంది. ఇది రక్తం, రొమ్ము, కాలేయం వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.
బొప్పాయి గింజలు యాంటీ వైరల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మంట, దురద, వాపు వంటి చర్మ వ్యాధుల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. ఒక టీస్పూను బొప్పాయి గింజల్ని ఎండబెట్టి పొడి చేసి నిమ్మరసంలో కలుపుకొని తాగడం ద్వారా కాలేయం మెరుగ్గా పనిచేస్తుంది.
బొప్పాయి గింజల్ని మెత్తగా చేసి సలాడ్స్‌లో, పాలు, తేనె కలుపుకొని కూడా తినవచ్చు. కానీ రోజుకు ఒక టీ స్పూన్ మాత్రమే బొప్పాయి గింజల మొత్తాన్ని వాడాలి. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, పదేళ్లలోపు పిల్లలు వీటిని అస్సలు తినకూడదు.
ఇక బొప్పాయి పండును ఉడికించి పేస్ట్‌లా చేసి దానికి ఫేషియల్‌గా కూడా వాడవచ్చు. దీనివలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మార్కెట్లో లభ్యమయ్యే అసహజమైన బ్యూటీ ఉత్పత్తుల కంటే.. బొప్పాయి గుజ్జే బెటర్. బొప్పాయిని నలభైరోజులు ఏకధాటిగా తింటే గుండె జబ్బు లక్షణాలు దూరమవుతాయి.