1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
  4. Life style, why some men doubt on women in romance

రోజుకో కొత్త భంగిమలో శృంగారం చేద్దామంటోంది... నాకేదో డౌటుగా వుంది...

Life style
ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రేమించే సమయంలోనే ఆమె గురించి నాకు బాగా తెలుసు. ఆమె చాలా ఫాస్ట్. మోడ్రన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఆమె భావాలు నాకు నచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడామె ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. శోభనం రోజున మాటల మధ్యలో ఓ ప్యాకెట్ బయటకు తీసింది. అందులో ఉన్న పుస్తకాన్ని తీసి నా చేతిలో పెట్టింది. ఆ పుస్తకంలో ఉన్న భంగిమలను చూస్తూ చాలా ఎక్జయిట్ అయ్యింది. అలాంటి భంగిమల్లో శృంగారం కావాలని అడుగుతోంది. 
 
ప్రతి రోజూ కొత్త భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందో అర్థం కావడం లేదు. ఆమెకు ఇప్పటికే శృంగారంలో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, నేను ఆమెను సంతృప్తిపరచలేక పోతున్నానేమోనని అనుమానం కూడా వస్తోంది. నా అనుమానం ఎంతవరకు నిజమో తెలియడంలేదు...
 
మీవి అర్థంలేని అనుమానాలు. మీరు సంతృప్తిపరచకుంటే ఆమె మిమ్మల్ని ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో చేయమని కోరదు. రోజుకో కొత్త భంగిమలో చేసుకోలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పటి అమ్మాయిలు ఆ పరిజ్ఞానాన్ని అబ్బాయిలతో సమంగానే తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఆమె అడుగుతుందంటే ముందే అనుభవం ఉందని అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. ఇకపోతే కామసూత్రలో కొన్ని భంగిమలు క్లిష్టతరంతో కూడుకున్నవి. వాటిని వేయాలంటే కొంత సాధన అవసరం. జాగ్రత్త.
తర్వాతి కథనం
ద్రాక్ష రసంలో పంచదార కలపకుండా త్రాగితే ఏమవుతుంది?