1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. benefits of elaichi or cardamom

ఆ ఒక్కటి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

benefits of elaichi
సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రకాల వంటకాల్లో, టీలో, యాలకులను ఉపయోగిస్తుంటాం. యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంది. అయితే రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజు ఇలా రాత్రివేళల్లో తీసుకుంటే మెడిసిన్స్‌తో అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఈ మధ్యకాలంలో బరువును తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోరకమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే బరువు సింపుల్‌గా తగ్గాలి అనుకునే వారు ప్రతిరోజు ఒక యాలక్కాయి తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల వారి శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుందట. దీంతో అధిక బరువు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట. అంతేకాదు శరీరంలోని చెడు పదార్థాలు కూడా తొలగిపోయి రక్తప్రసరణ సజావుగా జరుగుతుందట. అన్ని అవయవాలను శుద్థి చేసి కాపాడతాయట. 
 
మనం తీసుకునే పదార్థాల్లో చాలా జీర్ణం కాక అసిడెటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తుంటాయి. దీని కారణంగా అనేక మంది మలబద్థక సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఒక యాలకులు తిని గోరు వెచ్చని నీరు తాగితే ఆ సమస్య నుంచి బయటపడతారు. అంతే కాదు రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపట్టని వారికి కూడా యాలకులు మంచి ఔషధంలా పనిచేస్తుందట.
తర్వాతి కథనం
బానపొట్టకు కారాణాలివే..?