శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (12:26 IST)

రాత్రి వేళలో యాలకులు తీసుకుంటే... జీర్ణక్రియలకు...

సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రకాల వంటకాల్లో, మసాలాల్లో, టీలో యాలకులను ఉపయోగిస్తుంటారు. యాలకులు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చ

సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రకాల వంటకాల్లో, మసాలాల్లో, టీలో యాలకులను ఉపయోగిస్తుంటారు. యాలకులు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయ తిని గోరువెచ్చని నీళ్ళు త్రాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
ప్రతిరోజు రాత్రి వేళల్లో యాలకులు తీసుకుంటే రకరకాల మెడిసిన్స్‌తో అవసరం లేదంటున్నారు. ఈ మధ్య కాలంలో బరువును తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రయత్నం చేస్తున్నారు. అటువంటివారు యాలకులు తిని ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో అధిక బరువును, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు యాలకులు చాలా ఉపయోగపడుతాయి.
 
అంతేకాకుండా శరీరంలోని చెడు పదార్థాలు కూడా తొలగిపోయి రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. ఈ యాలకులు తీసుకుంటే జీర్ణక్రియ, అసిడిటీ వంటి సమస్యలు తొలగించుటకు సహాయపడుతాయి. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపట్టని వారికి కూడా యాలకులు మంచి ఔషదంగా పనిచేస్తాయి.