1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of Cardamom tea

ప్రతిరోజూ యాలకుల ''టీ'' తీసుకుంటే?

యాలకులను తరచుగా వంటకాల్లో వాడుతుంటారు. అటువంటి యాలకుల టీని తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాలకులలో ఉండే యాంటీ బ్యాక్టీయల్ గుణాలు నోట్లో ఉండే బ్యాక్టీయాలను తొలగించుటకు ఉపయోగపడుతాయి. ఈ యాలకులన

cardamom
యాలకులను తరచుగా వంటకాల్లో వాడుతుంటారు. అటువంటి యాలకుల టీని తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాలకులలో ఉండే యాంటీ బ్యాక్టీయల్ గుణాలు నోట్లో ఉండే బ్యాక్టీయాలను తొలగించుటకు ఉపయోగపడుతాయి. ఈ యాలకులను తరుచుగా ఆహారంలో చేర్చుకోవడం వలన గొంతు తడి ఆరిపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు యాలకుల టీ తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శ్వాస నాళాల్లో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోతాయి. ముక్కు రంధ్రాల్లో ఉండే మ్యూకస్ కరిగిపోతుంది. యాలకుల టీలో ఉండే సహజసిద్ధమైన యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు గాయాల నుండి కాపాడుతాయి.
 
తలనొప్పి, కీళ్ల నొప్పులు సమస్యలున్న వారు యాలకుల టీ తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. యాలకుల టీని తరుచుగా తీసుకోవడం వలన రక్త సరఫరా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్త నాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. శరీరంలో గల వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. దీని ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. 
About Writer
Kowsalya
తర్వాతి కథనం
ముప్పుతిప్పలు పెడుతున్న మానసిక ఒత్తిడి.. జయించేదెలా?