శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (16:33 IST)

లవంగాల పొడిని పాలలో కలుపుకుని తీసుకుంటే?

లవంగాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు వేయించి పొడిచేసుకుని తేనెలో కలుపుకుని తీసుకుంటే గ్యాస్ట్

లవంగాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు వేయించి పొడిచేసుకుని తేనెలో కలుపుకుని తీసుకుంటే గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించుటలో లవంగాలు దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి.

 
లవంగాలలో గల యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయ వ్యాధుల నుండి కాపాడుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. లవంగాలు శరీరంలో తెల్లరక్తకణాలను పెంచడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లవంగాలలో కొద్దిగా ఉప్పును కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ప్రతిరోజూ పాలలో కలుపుకుని తీసుకుంటే తలనొప్పి వెంటనే తగ్గుతుంది.  
 
దంత సంబంధమైన వ్యాధులను తొలగిస్తాయి. పంటి నొప్పితో బాధపడేవారు లవంగాలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అటువంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. నోటి దుర్వాసనను తగ్గించుటకు చక్కగా పనిచేస్తాయి. లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, పెయిన్ కిల్లింగ్ వంటి గుణాలు అధికంగా ఉన్నాయి.