మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (13:10 IST)

ప్రతిరోజూ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుంటే?

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువును తగ్గించుటకు బొప్పాయి మంచిగా ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరచుటలో చక్కగా పనిచేస్తుంది. కంప్యూటర్

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువును తగ్గించుటకు బొప్పాయి మంచిగా ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరచుటలో చక్కగా పనిచేస్తుంది. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, ఉరుకులు పరుగులు తీస్తున్న జీవితంలో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు బొప్పాయి ఎంతగానో సహాయపడుతుంది.
 
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో గల విటమిన్ సి శరీర రోగనిరోధ శక్తిని పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. ప్రతిరోజూ బొప్పాయిని స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఒత్తిడి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను తొలగించుటకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరం. 
 
బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తశుద్ధికి తోడ్పడుతుంది. డెంగ్యూ జ్వరంలో బాధపడుతున్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచుటకు సహాయపడుతుంది.