చక్కటి నిద్ర కోసం ఇలా చేయండి...
సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. కంటి నిండా నిద్రపోవడం వల్ల శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. సరైన నిద్రలేకపోతే అలసటతోపాటు శరీరానికి నిస్సత్తువ ఆవహించినట్టుగా ఉ
సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. కంటి నిండా నిద్రపోవడం వల్ల శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. సరైన నిద్రలేకపోతే అలసటతోపాటు శరీరానికి నిస్సత్తువ ఆవహించినట్టుగా ఉంటుంది. పైగా, ఏకాగ్రత కూడా లోపిస్తుంది. అలాగే, పనిపై శ్రద్ధ కూడా తగ్గిపోతుంది.
కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, అనారోగ్య సమస్యలు ఇలా చాలా అంశాలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ నిద్రకు దూరమవుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* ప్రతి రోజూ ఎన్ని పనులున్నప్పటికీ ఒకే సమయానికి పడుకుని నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
* పడకమీదికి చేరుకున్నాక 15 నిమిషాలైనా నిద్రపట్టకపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి.
* అలాగే, శరీరం అలసటగా ఉందని భావించినపుడు పడక మీదికి చేరుకోవాలి.
* కడుపునిండుగా భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించరాదు.
* నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి ఎట్టిపరిస్థితుల్లో కూడా వెళ్లరాదు.
* మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముందుకొస్తుంది. గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.
* రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది.