సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 15 ఆగస్టు 2018 (18:38 IST)

భర్తకు నిద్ర మాత్రలిచ్చి.. మరో వ్యక్తితో ఆ సంబంధం...

భార్యపై అనుమానంతో సోమవారం అర్థరాత్రి రోకలి బండతో మోది చంపిన ఘటన ఏలూరులో వెలుగులోకి వచ్చింది. రాంబాబు, నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. నిఖిత, భవిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు నిద్రలేమి సమస్

భార్యపై అనుమానంతో సోమవారం అర్థరాత్రి రోకలి బండతో మోది చంపిన ఘటన ఏలూరులో వెలుగులోకి వచ్చింది. రాంబాబు, నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. నిఖిత, భవిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు నిద్రలేమి సమస్యతో బాధపడటంతో రోజూ నిద్రమాత్రలు మింగేవాడు. భర్త రాంబాబు నిద్రమాత్రలు మింగి నిద్రపోయిన తర్వాత నాగలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు అనుమానం వచ్చింది. 
 
సోమవారం అర్థరాత్రి నిద్రమాత్రలు వేసుకున్నట్టు నటించిన రాంబాబు కళ్లు మూసుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి రాంబాబు నిద్రలోనుంచి లేచి చూడగా మరో వ్యక్తితో నాగలక్ష్మి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఇంతలో ఆమెతో వున్న వ్యక్తి పరారయ్యాడు. ఆవేశంతో రాంబాబు పక్కనే ఉన్న రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో నాగలక్ష్మి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. 
 
నాగలక్ష్మి మృత దేహాన్ని అక్కడే వదిలేసిన రాంబాబు ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు ఇంటికి వచ్చి పరిశీలించి వెళ్లాడు. సాయంత్రం ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్టు చెప్పి లొంగిపోయాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఏడాది క్రితం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇరువురు కేసు కూడా పెట్టుకున్నారు. 
 
పెద్దలు రాజీ చేయడంతో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నాగలక్ష్మికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో విచక్షణ కోల్పోయిన రాంబాబు రోకలి బండతో తలపై మోది నాగలక్ష్మిని హతమార్చాడు.