శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (16:06 IST)

ఎన్టీఆర్ బయోపిక్ : చంద్రబాబు సతీమణి భువనేశ్వరిగా ఎవరంటే?

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పలు కీలక పాత్రలకు పలువురు సీనియర్, జూనియర్ నటీనటులను ఎంపిక చేస్తున్నారు.
 
ఇందులోభాగంగా, ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నారు. అలాగే, చంద్రబాబు భార్యగా మంజిమా మోహన్ నటించనుంది. 
 
అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈమెను చంద్రబాబు భార్య భువనేశ్వరి పాత్రకు ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అలాగే, అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, సావిత్రిగా కీర్తి సురేష్‌లను ఎంపిక చేశారు.
 
అంతేకాకుండా, మరికొన్ని కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, కైకాల సత్యనారాయణ, రవి కిషన్, మురళీ శర్మ, సచిన్ ఖేదేకర్‌లు నటిస్తుంటే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ, విష్ణు ఇందూరిలు కలిసి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ సినిమా 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.