శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (09:15 IST)

భర్త మంచానపడ్డాడనీ... ప్రియుడితో కలిసి ఇటుకతో కొట్టి చంపేసిన భార్య...

పెళ్లయిన యేడాదికే భర్త అనారోగ్యంపాలై మంచానికే పరిమితమయ్యాడు. అలాంటి భర్తను కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్య... ప్రియుడుతో కలిసి హత్య చేసింది. అదీకూడా తలపై ఇటుకతో కొట్టి గోడకూలి చనిపోయాడంటూ కట్టుకథ అల్

పెళ్లయిన యేడాదికే భర్త అనారోగ్యంపాలై మంచానికే పరిమితమయ్యాడు. అలాంటి భర్తను కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్య... ప్రియుడుతో కలిసి హత్య చేసింది. అదీకూడా తలపై ఇటుకతో కొట్టి గోడకూలి చనిపోయాడంటూ కట్టుకథ అల్లింది. కానీ, పోస్టుమార్టం నివేదిక మాత్రం అది హత్య అని తేల్చడంతో భార్యతో పాటు ప్రియుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
 
ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. పరిశీలిస్తే, ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ ప్రాంతానికి చెందిన వీరేందర్ పాండే అనే వ్యక్తికి రంజూలు అనే మహిళతో ఐదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, పెళ్లి అయిన యేడాదికే భర్త వీరేందర్ పాండే అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భార్య అతన్ని ఆసుపత్రిలో చేర్పించింది. ఆ సమయంలో హరవీర్ అనే యువకుడితో రంజూకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
దీనికితోడు భర్త వైద్యం కోసం డబ్బులు చెల్లించలేక భార్య రంజూ ప్రియుడైన హరవీర్‌తో కలిసి వీరేందర్ పాండేను ఇటుకతో కొట్టి హతమార్చి, ప్రమాదవశాత్తూ గోడకూలి మరణించాడంటూ కట్టు కథ అల్లింది. వీరేందర్ పాండే తలకు దెబ్బ తగిలిందని పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా రంజూల, హరవీర్‌లను అరెస్టు చేశారు.