ఫేస్‌బుక్ లైవ్‌లో పెళ్లి.. కులం పేరిట పెద్దలు అడ్డుపడటంతో..?
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ అమ్మాయి తరపు పెద్దలు ప్రేమకు అడ్డు చెప్పారు. అంతే ఇక పెద్దల సమ్మతం కోసం ఆ జంట వేచి చూడలేదు. ఏకంగా పెళ్లి చేసుకుంటూ ఫేస్‌బుక్ లైవ్ పెట్ట
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ అమ్మాయి తరపు పెద్దలు ప్రేమకు అడ్డు చెప్పారు. అంతే ఇక పెద్దల సమ్మతం కోసం ఆ జంట వేచి చూడలేదు. ఏకంగా పెళ్లి చేసుకుంటూ ఫేస్‌బుక్ లైవ్ పెట్టారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కర్ణాటక మధుగిరికి చెందిన ఓ ప్రేమజంట ఫేస్‌బుక్ వేదికగా పెళ్లి చేసుకున్నారు. వధువు తరఫు కుటుంబసభ్యులు వీరి ప్రేమకు అడ్డుచెప్పారు. దీంతో వీరి పెళ్లి సామాజిక మాధ్యమాల సాక్షిగా జరగాలని, ఇందుకు పదిమంది మద్దతు ఉంటుందని భావించిన ఈ జంట ఈనెల 10న ఫేస్‌బుక్ లైవ్‌లో పెళ్లి చేసుకున్నారు.
మధుగిరిలోని జేడీఎస్ నేత తిమ్మరాజు కుమార్తె అయిన అంజన డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానిక గిరిజన ప్రాంతానికి చెందిన వ్యాపార వేత్త కిరణ్ కుమార్, అంజన కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అడ్డుపడ్డారు. కులం పేరుతో కిరణ్‌ను దూషించారు. దీంతోవేరే దారిలేక అంజన, కిరణ్‌లు తమ స్నేహితుల సాయంతో ఈనెల 10న ఫేస్‌బుక్‌లైవ్‌లో బెంగళూరులో హీసరఘట్టి వద్ద పెళ్లి చేసుకున్నారు.
మరోవైపు తిమ్మరాజు తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు వారి పెళ్లికి అభ్యంతరం తెలుపలేదు. ఇంకా వధూవరుల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇకపోతే.. సామాజిక మాధ్యమాల వేదికగా వీరిద్దరికీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ మరికొందరు నెటిజన్లు వీరి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.