బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By srinivas
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (22:18 IST)

స్పోర్ట్స్‌కి వెళ్లొస్తున్న పదో తరగతి బాలిపై అత్యాచారం... ఆపై హత్య

కర్ణాటక.. కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి అమ్మాయిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు. అమ్మాయిలు ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు కోరలు చాస్తున్నారు. బెంగళూరులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆ

కర్ణాటక.. కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి అమ్మాయిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు. అమ్మాయిలు ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు కోరలు చాస్తున్నారు. బెంగళూరులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆయుధంతో హత్య చేశారు దుండగులు.
 
వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని మలూర్ స్టేడియంలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేందుకు పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక వెళ్లింది. త్రో బాల్ క్రీడలో పాల్గొన్న ఆమె కార్యక్రమం ముగిశాక 5.30 నిమిషాల సమయంలో ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆమెను సమీపంలో వున్న ఓవర్ బ్రిడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత పదునైన ఆయుధంతో హత్య చేసి పరారయ్యారు. ఆమె తలపై తీవ్రమైన గాయాలున్నాయి. కాగా ఇప్పటివరకూ పోలీసులు హత్య చేసిన నిందితులను పట్టుకోలేకపోవడంపై స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరికంబ సర్కిల్లో ఆందోళనకారుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది.