హనుమంతుడి ఆరాధన ఫలితం...
శ్రీరామచంద్రుని పరమభక్తుడు హనుమంతుడు. ఈ హనుమని దైవంగా భక్తుల నుంచి పూజలు, అభిషేకాలు అందుకుంటాడు. అనేక నామాలతో సేవించబడుతుంటాడు. రాముని ఆలయంలోనే కాకుండా ప్రత్యేకంగాను ఆంజనేయ స్వామి కొలువై దర్శనమిస్తుంటాడు.

ఈ స్వామికి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువలన ఆయనని పూజించడం వలన దేవతలందరిన పూజించినట్లుగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాల్లో చెప్పబడుతోంది.
ఆంజనేయ స్వామి కొలుపుదీరిన ఆలయాలలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కన్నాపురంలో ఉంది. ఇక్కడి హనుమంతులవారు ఆలయంలో భక్తిభావ పరిమళాలను వెదజల్లుతుంటారు. స్వామివారిని అంకితభావంతో పూజిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయని భక్తులు విశ్వాసం. మంగళ, శని వారాల్లో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు.