శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (17:40 IST)

లక్ష్మీదేవి ఆరాధన ఫలితం...

ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్య లక్ష్మీ, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, సంతాన లక్షీ, విద్యాలక్ష్మీ, విజయ లక్ష్మీలను అష్ట లక్ష్ములుగా భక్తులు భావిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రోజు

ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్య లక్ష్మీ, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, సంతాన లక్షీ, విద్యాలక్ష్మీ, విజయ లక్ష్మీలను అష్ట లక్ష్ములుగా భక్తులు భావిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రోజున అష్ట లక్ష్ములను ఆరాధిస్తుంటారు. శ్రీమహా విష్ణువుకి, కృష్ణావతారంలో ఎనమండుగురు భార్యలు. లక్ష్మీదేవియే ఎనిమిది అంశలతో అష్ట భార్యలుగా ఆ స్వామిని సేవించారని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.
 
అష్ట లక్ష్ములకు భక్తులు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఈ లక్ష్ముల రూపాలు కలిగిన వెండి కలశం తమ ఇంట్లో తప్పకుండా ఉండేలా చూసుకోవడమే అందుకు నిదర్శనం. ఇక అష్టలక్ష్ములు కొలువైన ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఒక్కొక్క లక్ష్మీదేవిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. 
 
అష్ట లక్ష్ములలో ఏ ఒక్క లక్ష్మీదేవిని ఆరాధించినా మిగిలిన అందరి లక్ష్ముల అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్టలక్ష్ముల అనుగ్రహం కారణంగా సకల శుభాలు, సంపదలు చేకూరుతాయనేది మహర్షుల మాట.