1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Home Remedies to Head Ache

తలనొప్పికి మాత్రలు ఎందుకండీ... ఇలా చేస్తే పోదూ...

Home Remedies
సాధారణంగా మనలో చాలామంది తలనొప్పితో ఇబ్బందిపడుతుంటారు. తలనొప్పి అనేక కారణాల వల్ల రావచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు చాలా మంది మందులు వాడుతుంటారు. ఆ మందులు వల్ల తలనొప్పి తగ్గుతుంది కానీ... ప్రతిసారి మందులు వేసుకోవడం వల్ల అనేక రకములైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. తలనొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ప్రకృతిపరంగా లభించే కొన్ని పదార్థాలతో మనం ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. గంధపు చెక్క ద్వారా తలనొప్పిని తగ్గించుకోవొచ్చు. గంధాన్ని కాస్త పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. దాన్ని నుదుటిపై రాసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల తలనొప్పి మాయం అవుతుంది.
 
2. తలనొప్పి బాగా ఎక్కువగా ఉంటే కొద్దిసేపు కొబ్బరి నూనెతో తలపై, నుదుటిపై మర్దనా చేసుకోవాలి. దీని వల్ల కూడా తలనొప్పి సమస్య తగ్గిపోతుంది.
 
3. వెల్లుల్లి వల్ల కూడా తలనొప్పిగా ఈజీగా తగ్గించుకోవొచ్చు. వెల్లుల్లిని మెత్తగా చేసి దాని రసాన్ని తయారుచేసుకోండి. వెల్లుల్లి రసాన్ని కాస్త తాగితే చాలు.. ఈజీగా నొప్పి తగ్గిపోతుంది.
 
4. గ్రీన్ టీ ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవొచ్చు. గ్రీన్ టీలో కాస్త తేనె, కొద్దిగా దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించి వేడిగా తాగి కాసేపు పడుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.
 
5. కొన్ని గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని వాటిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండడం వల్ల క్రమంగా తలనొప్పి తగ్గిపోతుంది.
 
6. కాళ్లను వేడి నీళ్లలో ఉంచుకోవడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవొచ్చు. కాళ్లను కిందకు విడుస్తూ మంచంపై కూర్చుని కాళ్లను వేడి నీళ్లు ఉండే పాత్రలో ఉంచుకోవాలి. అలా కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత హాయిగా పడుకోవాలి.. నిద్రలోనే తలనొప్పి మాయం అయిపోతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
క్యాల్షియం లోపిస్తే.. ఆ వ్యాధి ఖాయం..?