శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (13:24 IST)

పెదాలు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు...

పెదవులు అందంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గుప్పెడు గులాబీ రేకుల్ని ముద్దగా చేసుకుని అందులో చెంచా వెన్న కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల బాదం నూనె చేర్చి పెదాలకు రాసుకుంటే మృదువుగా కనిపిస్తాయి. పెదవులు గులాబీరేకుల్లా ఉండాలంటే.. తేనె, పంచదార ఆలివ్‌నూనెల మిశ్రమాన్ని పెదాలకు రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగిపోతాయి. నలుపుదనం తగ్గుతుంది.
 
రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వలన ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. దాంతో పెదాలు తేమతో కాంతివంతంగా కనిపిస్తాయి. కొత్తిమీర, క్యారెట్‌లను రసంగా తీసుకుని సమాన పరిమాణంలో కలుపుకోవాలి. రోజూ రాత్రిపూట ఈ మిశ్రమాన్ని రాసుకుంటే పెదాలు మృదువుగా మారతాయి.
 
పెదాలు నల్లగా ఉన్నాయని బాధపడుతున్నారా.. అందుకు కొబ్బరి నూనె మంచి టిప్.. కొబ్బరి నూనెను వేడిచేసి అందులో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పెదాలకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. పెదాలు అందంగా, మృదువుగా మారుతాయి. అలానే బీట్‌రూట్ రసాన్ని రాత్రి పెదాలకు రాసుకుని ఉదయాన్నే కడుక్కున్నా కూడా పెదాలు ఎరుపుగా మారుతాయి.