1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. Coriander Leaves Water for Kidneys clean

ఐదు రూపాయల కొత్తిమీర కట్టతో కిడ్నీలు శుద్ధి... ఎలా?

శరీర అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఎంతో ముఖ్యమైనవి. శరీరంలోని విషపూరిత లవణాలు, చెమటను శరీరం నుంచి బయటకు పంపించి వేస్తూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి కిడ్నీల పట్ల అశ్రద్ధ చేస్తే.. మూత్రపిం

Coriander Leaves Water
శరీర అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఎంతో ముఖ్యమైనవి. శరీరంలోని విషపూరిత లవణాలు, చెమటను శరీరం నుంచి బయటకు పంపించి వేస్తూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి కిడ్నీల పట్ల అశ్రద్ధ చేస్తే.. మూత్రపిండాల్లో రాళ్లు చేరడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కిడ్నీల్లో చేరిన రాళ్లను తొలగించుకోవాలంటే లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇంటిపట్టునే ఉంటే మూత్ర పిండాలని శుద్ధి చేసుకోవచ్చు. అదీ కూడా ఐదు రూపాయల విలువ చేసే కొత్తిమీర కట్టతో. అదెలాగో చూద్ధాం. 
 
ఐదు రూపాయల విలువ చేసే కొత్తిమీర కట్టను తీసుకుని దాన్ని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి... శుభ్రంగా నీటిలో కడగాలి. ఆ తర్వాత ఆ కొత్తిమీర ముక్కలను 2 లీటర్ల నీటిలో బాగా మరింగించాలి. ఈ నీటిని చల్లార్చి.. ఓ బాటిల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ రసాన్ని ప్రతి రోజూ ఒక గ్లాసుడు చొప్పున తాగినట్టయితే కిడ్నీలు శుభ్రపడటమే కాకుండా కిడ్నీల్లోని రాళ్ళు కూడా కరిగిపోతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని గృహవైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
అయితే, ఈ చక్కెర వ్యాధితో బాధపడేవారు ఈ రసాన్ని తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. కొత్తిమీర ఆకుల్లో అధిక మోతాదుల్లో పొటాషియం ఉంటుంది. అందువల్ల కొత్తిమీరతో పాటు.. కొత్తమీర రసానికి డయాబెటిక్ పేషంట్లు దూరంగా ఉండటం మంచిది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో కోర్కెలు ఎక్కువగా ఉంటాయా? సర్వే ఏం చెబుతోంది