సోమవారం, 27 ఏప్రియల్ 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chitra
Last Updated : బుధవారం, 27 జనవరి 2016 (10:04 IST)

అరకప్పు బ్రౌన్ రైస్‌తో సంపూర్ణ ఆరోగ్యం.. ఎలా?

దక్షిణ భారతదేశంలో ప్రధానంగా అందరూ తినే ముఖ్యమైన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం గురించి, దానికోసం వాడే బియ్యం గురించి ఎప్పుడు ఆలోచించం. అంటే దానిలోని పోషక విలువల గురించి అస్సలు పట్టించుకోం. సాధారణంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిగా, కనబడుతుందా అనే ఆలోచిస్తుంటాం. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారు చేస్తే అందులో ఉన్న పోషక విలువలు పోతాయి. బ్రౌన్ రైస్‌తో వండిన అన్నం కంటికి ఇంపుగా అనిపించదు. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం ఆకర్షణీయంగా ఉండటం కోసం పాలిష్ చేస్తే, అందులోని కెమికల్ ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బి-కాంప్లెక్స్ విటమిన్లను హరింపజేస్తుంది. అయితే బ్రౌన్ రైస్‌లో ఉన్నప్రత్యేకతను ఒక్కసారి తెలుసుకుందాం! 
 
బ్రౌన్ రైస్‌ తిననడం వల్ల రొమ్ము కేన్సర్ వచ్చేఅవకాశాలు చాలా వరకు తగ్గుతుంది. బ్రౌన్ రైస్‌‌లో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము కేన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహయపడుతుంది. 
 
బ్రౌన్ రైస్‌లో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. 
 
శరీర బరువును తగ్గించడంలో బ్రౌన్ రైస్‌ ప్రధానపాత్ర వహిస్తుంది. బ్రౌన్ రైస్‌లో పీచు సమృద్ధిగా ఉండటం వలన పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళలలో అదనపు బరువు పెరుగదు.
 
ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మెగ్నీషియం లభ్యమవుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. అంతేకాదు  ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. బ్రౌన్ రైస్‌లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
 
పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. ప్రతిరోజు అర కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చేందుకు గొప్పగా సహాయపడుతుంది.