1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 11 climbers killed as Indonesia's Marapi volcano erupts

మౌంట్ మరాపి నిప్పులు కక్కింది.. 11 మంది ట్రెక్కర్లు మృతి

climbers
ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో 11 మంది ట్రెక్కర్లు మృతి చెందారు. మౌంట్ మరాపి వాల్కనో ఆదివారం నాడు నిప్పులు కక్కింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 11 మంది పర్వతారోహకులు విగత జీవుల్లా కనిపించారు. మొత్తం 26 మందితో కూడిన పర్వతారోహకుల బృందంలో చాలా మంది గల్లంతయ్యారు. 
 
అయితే, అధికారులు ఈ బృందంలో ముగ్గురిని కాపాడగలిగారు. కాగా, ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో ఆకాశంలోకి 3 కిలోమీటర్ల ఎత్తున బూడిద ఆవరించింది. పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' జోన్ లో ఉన్న ఇండోనేషియాలో అత్యధికంగా 130 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
2023లో డైరైక్టుగా KTR సీఎం: రాసిపెట్టుకోమన్న ఆస్ట్రాలజర్ వేణుస్వామి, కానీ ఇలా జరిగిందేంటి?