శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (19:27 IST)

2023లో డైరైక్టుగా KTR సీఎం: రాసిపెట్టుకోమన్న ఆస్ట్రాలజర్ వేణుస్వామి, కానీ ఇలా జరిగిందేంటి?

KTR
కర్టెసి-ట్విట్టర్
ఆస్ట్రాలజర్ వేణుస్వామి. ఈయన చెప్పే జ్యోతిషం కొన్నిసార్లు అనుకోకుండా నిజం అవుతుంటుంది, మరికొన్నిసార్లు బోల్తా కొడుతుంటుంది. ఐతే ఆయన చెప్పే జ్యోతిషం, గ్రహదోష నివారణల కోసం సెలబ్రిటీలు సైతం క్యూ కడుతుంటారు. అందుకే ఆయన హైదరాబాద్ నగరంలో చాలా పాపులర్.
 
ఇక అసలు విషయానికి వస్తే... 2023 ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకుండా కేటీఆర్ అవుతారనీ, అది కూడా డైరెక్టుగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు... 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసిపి ఘన విజయం సాధిస్తుందనీ, వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ జోస్యం చెప్పారు. ఇపుడీ వీడియో హల్చల్ చేస్తోంది. ఐతే కేటీఆర్ సీఎం అవ్వడం సంగతి అటుంచి భారాస ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీనితో వేణుస్వామి చెప్పే జాతకాలు తిరగపడుతాయంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.